పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎకో టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర శకావత్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు కోరారు. బుధవారం కేంద్రమంత్రిని కలిసి రామగిరి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని కోరారు.
త్రివేణి సంఘమంలో ఉన్న కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పరచాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో ఎకో టూరిజం హబ్ ను ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందేవిధంగా ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు.
- Advertisement -