ప్రభన్యూస్ : ప్రభుత్వ వైద్యుల ప్రయివేటు క్లినిక్‌ల దందాపై కొద్ది రోజుల కిందట వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలను చేపట్టిన మంత్రి హరీష్‌రావు సీరియస్‌గా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ… ప్రయివేటు క్లినిక్‌లు, ప్రయివేటు ఆసుపత్రుల్లో పనిచేసే వారి జాబితా రూపొందించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా ప్రయివేటు క్లినిక్‌ల దందా నడుపుతున్న వైద్యుల సమాచారాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధం చేసినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఆ జాబితాను మంత్రి హరీష్‌రావుకు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ వైద్యుల్లో 50శాతం మంది ప్రస్తుతం ప్రయివేటుగా క్లినిక్‌లను నడపడమో, లేదా ప్రయివేటు ఆసుపత్రుల్లో గెస్టు వైద్యులుగా పనిచేయడమో జరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌తో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యుల్లొ 50శాతం మంది ఓపీ చూశాక ఆసుపత్రుల్లో కనిపించరన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఉదయం ఓపీ తర్వాత చాలా మంది డాక్టర్లు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయి సొంత క్లినిక్‌లు నడుపుతున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రభుత్వ వైద్యుల సొంత క్లినిక్‌ల నిర్వాకంతో సర్కారు ఆసుపత్రులకు వచ్చే పేద, సామాన్య రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది సీనియర్, హెచ్‌వోడీ స్థాయిలో ఉన్న డాక్టర్లకు సొంతంగా ప్రయివేటు క్లినిక్‌లు, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఉద్యోగాలు ఉండడంతో సర్కారు ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యంఅందడం కష్టమవుతోంది. సీనియర్ వైద్యులు, స్పెషలిస్టులు అందుబాటులో లేకపోతుండడంతో బోధనాసుపత్రుల్లో రోగులకు పీజీ వైద్యులు, జూడాలే చికిత్స చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital