Wednesday, November 20, 2024

Karimnagar | రూల్స్ పాటించ‌ని వాహనదారులపై సీరియ‌స్ యాక్ష‌న్‌.. పెద్ద ఎత్తున ఫైన్ వేస్తున్న పోలీసులు

రోడ్డు నియ‌మాలు పాటించ‌కుండా.. ఇష్ట‌మున్న‌ట్టు వాహ‌నాలు న‌డిపై వారిపై కరీంనగర్ పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. రూల్స్ పాటించకపోవడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ రకాల వాహనాల నెంబర్లు కనిపించకుండా ట్యాంపరింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, భారీ శబ్దాలు వచ్చేలా ఆదనపు సైలెన్స‌ర్ల‌ను బిగించి రోడ్ల‌మీద తిరిగేవారిపై దృష్టిసారించారు. డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా, అతివేగంతో వాహనాలు నడుపడం, త్రిబుల్ రైడింగ్ లకు పాల్పడుతున్న మైనర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ చ‌ర్య‌లు ఇక‌మీద‌ట కూడా కొనసాగించాలని పొలిస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు.

ఈ-చలాన్ల నుండి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు వివిధ రకాల పద్దతుల‌ను అవ‌లంభిస్తున్నారు. కొన్ని నెంబర్లు చిన్నగా, కొన్ని జిగ్ జాగ్ గా, మరికొందరు వాడ‌కంలో లేని వాహ‌నాల నెంబర్ ప్లేట్లను పెట్టుకుని సంచరిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో దొంగిలించబడిన వాహనాలు కూడా అప్పుడప్పుడూ.. రోడ్లపైకి వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీపీ సుబ్బ‌రాయుడు తెలిపారు. ఇలాంటి స్పెషల్ డ్రైవ్ ల తో చోరీకి గురైన వాహనాలు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంద‌న్నారు.

ట్రాఫిక్ పోలీసుల పరిధిలో..
రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది జనవరి నుండి ఈనెల 22వ తేదీ (బుధవారం) వరకు నియమనిబంధనలను పాటించని వారిపై వివిధ రకాలకు చెందిన 47,293 కేసులను నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు 323, హెల్మెట్ ధరించకుండా న‌డిపేవారు 41, 622, అతివేగంతో నడ‌పడం 1019, రాంగ్ సైడ్ డ్రైవింగ్ 909, రోడ్లపై వాహనాలు నిలుపదల చేసి ట్రాఫిక్ నకు అంతరాయం కలింగించడం1877, లైసెన్సులు లేకుండా నడుపడం 515, నెంబర్ ప్లేట్ల ట్యాపరింగ్ 58. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం 197, త్రిబుల్ రైడింగ్ 367, శబ్దకాలుష్యానికి కారమైన వాహనాలు 03 మైనర్ డ్రైవింగ్ 2 అతివేగంతో వాహనాలు నడిపడం, పరిమితికి మించి ఎక్కించుకున్న వాహనదారులులతో పాటు వివిధ రకాల రోడ్డునియమనిబంధనలు ఉల్లఘించిన వారిపై కేసులను నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement