Friday, November 22, 2024

HYD: పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయం.. నైజీరియన్ అరెస్టు

పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి కోట్ల రూపాయల విలువైన హెరాయిన్, కొకైన్, తొమ్మిది ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియ‌న్ అరెస్టు పై పంజాగుట్ట వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వివ‌రాలు వెల్ల‌డించారు. నైజీరియన్ దేశస్థుడు స్టాన్లీ గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. 2015లో నార్కోటిక్ బ్యూరో అధికారులకు స్టాన్లీ పట్టుబడ్డాడని తెలిపారు. దేశవ్యాప్తంగా స్టాన్లీ వద్ద చాలా మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించామ‌న్నారు. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో నిఘా పెట్టామన్నారు.

రూ.8కోట్ల విలువ గల 557 గ్రాముల కొకైన్, 902 ఎకాస్టే పిల్స్ (390 గ్రాములు), 105 ఎల్ఎస్డీ బ్లాట్స్, 215 గ్రాముల చరాస్, 21 గ్రాముల హెరాయిన్, 7 గ్రాముల అంఫేటమిన్, 45 గ్రాముల ఓజీ వీడ్, 8సెల్ ఫోన్స్, 5.4 లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. నిందితుడు హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఈ నిందితుడి లిస్ట్ లో 500మంది వినియోగదారులను గుర్తించామన్నారు. హైదరాబాద్ కి చెందిన ఏడుగురు డ్రగ్స్ వినియోగదారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. షార్ట్ క‌ట్ లో డబ్బులు సంపాదించాల‌ని ఆశపడి డ్రగ్ వ్యాపారం మొద‌లు పెట్టాడ‌ని డీసీపీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement