Monday, November 18, 2024

తెలంగాణలో ఆ గ్రామంలో సెల్ఫ్ లాక్‌డౌన్

దేశవ్యాప్తంగా రోజురోజుకు క‌రోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు పెగుతున్నాయి. దీంతో క‌రోనా, ఒమిక్రాన్ ల నుంచి త‌మ‌ను తాము కాపాడుకునేందుకు గ్రామాల ప్ర‌జ‌లు ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోక గ్రామంలో గ్రామస్తులు సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామస్తులు పది రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకోగా కొత్తగా ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపురం గ్రామస్థులు తీర్మానం చేసుకొని బుధవారం రోజు నుండి గురువారం వరకు రెండు రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. నారాయణపురం కు చెందిన గల్ఫ్ కార్మికుడికి ఒమిక్రాన్ నిర్దారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామ ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజులు గ్రామంలోని అన్ని రకాల దుకాణాలు మూసి వేయడానికి తీర్మానించుకున్నారు. కిరాణా షాపులకు మాత్రం ఉదయం 10 గుంటల వరకు, సాయంత్రం 6 గంటలు నుండి 8 గంటలు వరకు మినహాయింపు ఇచ్చుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement