జావలిన్ డే సందర్భంగా నిర్వహించిన అథ్లెటిక్ క్రీడా పోటీల్లో ఆర్జీయూకేటీ విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్ర అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో అండర్ 16, అండర్ 18, అండర్ 20 బాల బాలికల విభాగాల్లో ఆర్జీయూకేటీ విద్యార్థులు ఎంపిక అవ్వడం పట్ల వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వెంకటరమణ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ… ఆర్జీయూకేటీ విద్యార్థులు విద్యలోనే కాక క్రీడల్లోనూ ప్రతిభ కనబరచడం ఎంతో హర్షణీయమని తెలిపారు. ఈనెల ఏడవ తేదీన హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారు.
వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల వివరాలిలా ఉన్నాయి.
రన్నింగ్ ఈవెంట్స్: 1)మాధవి 100మీ 1వ మరియు జావెలిన్ 1వ స్థానం u-16 అమ్మాయి. 2)నవీనా 100మీ 1వ స్థానం U-18 అమ్మాయి. 3) సంజయ్ 100మీ 1వ స్థానం U-18 బాలురు. 4)నిహారిక 400మీ 1వ స్థానం U-18 బాలికలు. 5)అరవింద్ 400మీ యు-18 బాలురు. 6)ఆర్.శివ 100&400మీ 2వ స్థానం పురుషులు. 7)జానీ 400మీ 2వ అండర్-20 బాలురు. 8)కె.విజయ్ 100మీ & జావెలిన్ సెకండ్. 9)రాకేష్ జావెలిన్ 1వ స్థానం పురుషులు. 10) క్రీతి శ్రీ జావెలిన్ 1వ స్థానం U-18 బాలికలు. 11)కిరణ్‌కుమార్ 1వ స్థానం జావెలిన్ u-18బాయ్. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ యు ప్రభాకర్ రావు, పిడి శ్యాంబాబు, రవి కిరణ్, పీఈటీలు రఘువీర్, స్వప్న, వసంత, తదితరులు పాల్గొన్నారు.