Saturday, November 23, 2024

రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింట‌న్ కు క్రీడాకారుల ఎంపిక

వరంగల్ స్పోర్ట్స్, ( ప్రభ న్యూస్) : క్రీడలతోనే మానసిక వికాసం లభిస్తుందని, ఆర్మూర్ లో జరిగే రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్ గెలుపే లక్ష్యంగా గెలుపొందాలని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ అధ్యక్షుడు రవీంద్రకుమార్ అన్నారు. హన్మకొండ జిల్లా జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం అండర్ పది హెను 40వ సబ్ జూనియర్ సెలెక్షన్లను బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. 40వ రాష్ట్ర స్థాయిలో బాల్ బ్యాడ్మింటన్ ఆడుటకు 23మంది బాల బాలికలను సెలక్ట్ చేయడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో సెలెక్షన్ కమిటీ ఎన్నిక చేశారని, ఎంపికైన వారు ఆర్మూర్ లో జరిగే రాష్ట్ర స్థాయిలో ఆడుతారని, రాష్ట్ర స్థాయిలో రాణించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంలో జాతీయ స్థాయిలో ఆడుతారన్నారు. ప్రతి సంవత్సరం సబ్ జూనియర్ జూనియర్, సీనియర్ ఎన్నిక చేస్తామన్నారు. కూనూర్ జెడ్పీ యస్ యస్ నుండి 9 మంది విద్యార్ధులు ఎంపిక అవడం విశేషం.


21 నుండి కునూరులో ట్రైనింగ్ క్యాంపు :
అండర్ 15లో సెలెక్ట్ అయిన క్రీడాకారులకు కూనురు, ఉప్పు గల్లులో బాల బాలికలకు ఈ నెల 21 నుండి 25 వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 26న ఆర్మూర్ లో జరిగే రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్ ను గెలుపొందడమే లక్ష్యంగా.. నిర్వాహకులు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ ట్రైనింగ్ క్యాంపు లో రాజీ రెడ్డి, అయోధ్య లు తమ స్వంత ఖర్చుతో ఈ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ( విశ్రాంత అదనపు కలెక్టర్) ప్రసాదరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ ఈశ్వర్ కుమార్, కోశాధికారి రాజిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అయోధ్య, సబ్ ఇన్స్పెక్టర్ కొమురయ్య, ప్రభాకర్, కడారి రవి, రమేష్ అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement