Wednesday, December 25, 2024

TG | మూడు కోట్ల విలువ చేసే డ్ర‌గ్స్ ప‌ట్టివేత

  • సంగారెడ్డి పోలీసులు, న్యాబ్ జాయింట్ ఆప‌రేష‌న్
  • పటాన్ చెరులోని గోడౌన్ పై దాడి
  • కిలో ఎంఎడిఎ డ్రగ్స్ స్వాధీనం
  • ఇద్దరు అరెస్ట్..మరికొందరి కోసం గాలింపు


సంగారెడ్డి – నూతన సంవత్సర వేడుకల్లో విక్రయించడానికి డ్రగ్స్ తరలిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నమ్మదగిన సమాచారం మేరకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులతో పాటు పటాన్ చెరు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు.

పటాన్ పోలీస్ స్టేషన్ లో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్, నార్కోటిక్ బ్యూరో ఎస్పీ చైతన్య లు ఇవాళ‌ నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఈ కేసు వివ‌రాల‌ను వెల్ల‌డించారు.. ఢిల్లీ, ముంబై నుంచి హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకల కోసం పెద్ద ఎత్తున డ్రగ్స్ ను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో స్థానిక పోలీసులకు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ లో నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి సమీపంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. అదుపులోకి తీసుకొని విచారించారు.

మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన అబ్దుల్ హమీద్ షేక్, ముఖేష్ దూబే అనే ఇద్దరు వ్యక్తులు.. నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్ లోని కస్టమర్లకు విక్రయించేందుకు హైదరాబాద్ కు చెందిన షేక్ అమీర్ అనే వ్యక్తి కోసం వెయ్యి గ్రాముల నిషేధిత ఏండీఏంఏ డ్రగ్స్ ను తీసుకొని వచ్చినట్లు తెలిపారు. దీనిని ఢిల్లీలో ఉంటున్న జిమ్మీ, జిన్ని అనే ఇద్దరు నైజీరియన్ల వద్ద కొనుగోలు చేసినట్లు నిందితులు విచారణలో తెలిపారన్నారు. ఢిల్లీలో గ్రామును వేయి రూపాయలకు కొనుగోలు చేసి.. హైదరాబాదులో రూ.4 వేల నుంచి 5 వేలకు విక్రయిస్తున్నారని తెలిపారు.

- Advertisement -

వీరితో పాటు ముంబైకి చెందిన రాయిస్ ఖాన్ అనే వ్యక్తి సైతం నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు నేరస్తుల ద్వారా తెలిసిందని ఎస్పీ రూపేష్ తెలిపారు. జారీడ్రగ్స్ పెడ్లర్ల నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్న కొనుగోలుదారులను సైతం గుర్తించడం జరిగిందని, త్వరలోనే విచారించి వారిపై సైతం చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్లో రూ.మూడు కోట్ల రూపాయలపైన ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement