Wednesday, December 18, 2024

TG | రూ.కోటికి పైగా విలువ చేసే డ్ర‌గ్స్ ప‌ట్టివేత

  • మధ్యప్రదేశ్ నుంచి అక్రమ రవాణా
  • మీర్ పేట త‌నిఖీల‌లో ప‌ట్టుకున్న రాచ‌కొండ పోలీసులు
  • ముగ్గురు అంత‌రాష్ట్ర ముఠా స‌భ్యుల అరెస్ట్

హైద‌రాబాద్ – రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ పోలీసులు భారీ డ్ర‌గ్స్ రాకెట్ ను చేదించారు.. నేడు కోటి 25 లక్షల విలువచేసే 53.5 కిలోల మాదకద్రవ్యాలను నేడు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ నగరానికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర రాకెట్‌‌ను మీర్‌పేట్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ జోన్ ఎస్ వో టి పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి కోటి 25 లక్షల విలువచేసే 53.5 కిలోల గసగసాల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అంతర్రాష్ట్ర ముఠాకు ముగ్గురిని అరెస్టు చేశారు. గసగసాల , ఎఫ్ ఎం వంటి మాదక ద్రవ్యాలను మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కి తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.

ఎన్ని కఠిన చర్యలు..

హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ బూతం వీడటం లేదు. ఇప్పటి వరకు జిల్లాలు, రాష్ట్రాల నుంచి సరఫరా అయిన డ్రగ్స్‌ ఇప్పుడు ఏకంగా దేశాలను దాటించి మరీ హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఎల్బీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. అయితే హైదరాబాద్‌లో ఇటీవల భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం, పోలీసులు చెప్పినప్పటికీ ఏదో విధంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తునే ఉన్నారు ముఠా సభ్యులు. ఇటీవల దాదాపు రూ.25 లక్షలు విలువల చేసే డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ఫెడ్లర్‌తో పాటు అంతర్రాష్ట్ర ఫెడ్లర్‌ను కూడా ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. అయితే తరచూ ఇలా డ్రగ్స్‌ పట్టుబడుతుండటం పోలీసులకు పెను సవాల్‌గా మారింది.

- Advertisement -

హైదరాబాద్‌ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్..

తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని మత్తుపదార్థాలు పట్టిపీడిస్తున్నాయి. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రోజుల వ్యవధిలోనే కొత్తకొత్త డ్రగ్స్ కేసులు నగరంలో వెలుగు చూస్తున్నాయి. ఎస్.ఆర్.నగర్‌ బాయ్స్ హాస్టళ్ల కేంద్రంగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అలాగే నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు సైతం డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇవేగాకుండా ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఎన్ని కేసులు చేధించినా మత్తుపదార్థాల సరఫరాకు డ్రగ్ పెడ్లర్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

డ్రగ్ పెడ్లర్లకు పోలీసుల హెచ్చరిక..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో తెలంగాణ పోలీసులు డ్రగ్స్ క్రయవిక్రయాలపై ఉక్కుపాదం మోపారు. జూబ్లీహిల్ పబ్బులు సహా పలు ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల పలువురు బడా పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు సైతం మత్తుపదార్థాలు వాడి తనిఖీల్లో పట్టుబడ్డారు. అయితే యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని చెబుతున్నారు. బెంగళూరు నుంచి అధికంగా డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మత్తుపదార్థాలు సరఫరా చేస్తూ పట్టుపడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement