- సినీ ఫక్కిలో రవాణా
- వీటి విలువ రూ.72.5 లక్షలు
- కంటైనర్ డ్రైవర్ అరెస్టు
ఆంధ్రప్రభ స్మార్ట్, ఆసిఫాబాద్ : వాంకిడి సరిహద్దులోని చెక్‌పోస్టు వద్ద 290 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 72.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కంటైనర్ డ్రైవర్ బల్వీర్ సింగ్ ను అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.
పుష్ప సినిమా తరహాలో
పుష్ప సినిమా తరహాలో కంటైనర్ లో రవాణా అవుతున్న గంజాయిని వాంకిడి సరిహద్దులోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అంతరాష్ట్ర సరిహద్దు అయిన వాంకిడి వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగా ఆసిఫాబాద్ వైపు నుండి మహారాష్ట్ర వైపుకు వెళుతున్న కంటైనర్ డ్రైవర్ ను అనుమానిస్తూ విచారించారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు కంటైనర్ తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ కంటైనర్ డ్రైవర్ బల్వీర్ సింగ్ ని విచారించగా మహారాష్ట్రకు చెందిన అరబింద్ అనే వ్యక్తి తనను గంజాయి సరఫరా కోసం రాజమండ్రి కి పంపాడని తెలిపారు.
290 కిలోల గంజాయి స్వాధీనం…
నిందితుడి నుండి 145 గంజాయి ప్యాకెట్స్, ఒక్కొక్కటి సుమారు రెండు కేజీల, మొత్తం 290 కిలోల బరువు ఉన్నాయి. వీటి విలువ 72 లక్షల 50 వేల రూపాయల విలువ ఉంటుందని పోలీసులు అంచనా. కంటైనర్, మొబైల్ ఫోన్ స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న లారీ డ్రైవర్ ను అరెస్టు చేశారు. ఈ గంజాయి సరఫరాలో ముఖ్య నిందితుడు అయిన అరబింద్ ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్ కు పంపినట్లు ఎస్పీ తెలిపారు.