Thursday, November 28, 2024

అక్రంగా నిల్వచేసిన‌ 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్

పీడీఎస్ రైస్ అక్రమ దందా చేసే స్మగ్లర్ గుట్టును వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బహిర్గత పర్చారు. గ్రామ శివారులో రేషన్ రైస్ ను అక్రమంగా నిల్వ చేస్తూ, గుట్టుగా చీకటి వ్యాపారం సాగిస్తున్న పీడీఎస్ రైస్ డంప్ పై దాడి చేశారు. ఈ దాడిలో 250 క్వింటాళ్ళ రేషన్ రైస్ ను, వేయింగ్ మిషన్, స్టిచింగ్ మిషన్, వంద ఖాళీ గొనె సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్ట‌ర్లు ఆర్.సంతోష్, సీహెచ్ శ్రీనివాస్ జీ ల నేతృత్వంలో పక్కా సమాచారం మేరకు దాడి చేసి, గుట్టుగా సాగుతున్న బండారాన్ని బట్ట బయలు చేశారు. నర్మెట్ట మండలంలోని ఆగాపేట్ గ్రామ అవుట్ స్కర్ట్ లో అక్రమంగా రేషన్ రైస్ డంప్ ను ఏర్పాటు చేసి నిల్వ చేస్తున్నారు. నిరుపేదలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పీడీఎస్ రైస్ ను చుట్టు పక్క గ్రామాల నుండి కొనుగోళ్ళు చేస్తూ, డంప్ లో నిల్వ చేస్తున్నారు. ఒక్కసారి లారీ లోడ్ కాగానే అవసరమైన వారికి అధిక ధరకు విక్రయిస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో తేలింది. పౌల్ట్రీ ఫార్మ్స్, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. నర్మెట్ట మండలం ఆగా పెట్ గ్రామ అవుట్ స్కర్ట్ లోని డంప్ లో లభ్యమైన 250 క్వింటాళ్ల రేషన్ రైస్ ను తదుపరి చర్యల కోసం సంబంధిత మండల పోలీసులకు అప్పగించారు. 6 లక్షల 50 వేల విలువ గల బియ్యంను చట్ట విరుద్ధంగా నిల్వ చేసిన కల్యాణం చంద్రమౌళి (52)ని అరెస్ట్ చేశారు. సిద్ధిపేటకు చెందిన పండు, జనగామకు చెందిన మణికంఠ రైస్ మిల్ ఓనర్, వెంకటేశ్వర రైస్ మిల్ ఓనర్ లు పరారీలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement