Wednesday, November 20, 2024

TS : సీతమ్మ‌కు సిరిసిల్ల నేతన్న బంగారు పట్టు చీర

సిరిసిల్ల, ఏప్రిల్ 17 (ప్రభన్యూస్): సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ బంగారు వెండి జరీతో నేసిన చేనేత పట్టుచీర భద్రాద్రి సీతారాముల కల్యాణానికి ఆలయ ఈవో రమాదేవికి స్వయంగా అందించాడు. బుధవారం ఈ పట్టు చీరను గర్భాలయంలో జరిగే మూలవిరాట్ కళ్యాణానికి అమ్మవారికి అలంకరించి భద్రాద్రి ఆలయ వేద పండితులు కళ్యాణం జరిపించారు.

- Advertisement -

ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ తను నేసిన చీర సీతమ్మ కళ్యాణానికి అలంకరణగా ఉపయోగించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని, ఇన్ని రోజులు కష్టపడ్డ తన శ్రమకు ఫలితం దక్కిందని హరిప్రసాద్ తెలిపాడు. ఈ సందర్భంగా ఆలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హరి ప్రసాద్ ను అభినందించారు. చీర గురించి వివరాలను సీఎస్ కు హరిప్రసాద్ వివరించారు. ఇది ఇలా ఉండగా సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల సీతమ్మ కళ్యాణం చీర ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తున్న వెల్ది హరిప్రసాద్ ఈసారి కూడా మరో అద్భుతమైన చీరను చేనేత మగ్గంపై సీత రాముల కళ్యాణం వచ్చే విధంగా తయారు చేశారు.

ఈ చీర ప్రత్యేకత లో అంచులు భద్రాద్రి దేవాయాయంలో ఉన్నటువంటి సీతారాముల ప్రతిరూపాలు అంచులు వచ్చే విధంగా చీర మొత్తం శంకు చక్ర నామాలు తీరపై బార్డర్లో జైశ్రీరామ్ అంటూ వచ్చే విధంగా ఆరు రోజుల పాటు శ్రమించి ఈ చీరను చేనేత మగ్గంపై నేశాడు. ఈ చీర బరువు 800 గ్రాములు ఉన్నది. ఇందులో రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, పట్టు దారాలతో నేశాడు. చీర కొంగులో సీతారాముల కళ్యాణం బొమ్మనేయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement