భారీగా తరలి రానున్న భక్త జనం
సికింద్రాబాద్ రూట్ లో ట్రాపిక్ ఆంక్షలు
ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచనలు
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రేపు జరగనుంది. బోనాల జాతరకు అధికారులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉజ్జయిని మహంకాళి టెంపుల్‌కు 2 కిలో మీటర్ల పరిధిలో ఈ అంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ట్రాఫిక్ మళ్లింపు
కర్బాలా మైదాన్, రాణిగంజ్, రామ్‌గోపాల్‌ఫేట్ ఓల్డ్ పీఎస్, పారడైస్, సీటీవో ప్లాజా, ఎస్బీఐ ఎక్స్ రోడ్, వైఎంసీఏ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్‌లేన్, బాటా, బైబిల్ హౌజ్, మినిస్టర్ రోడ్, రసూల్‌పురా వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను కూడా పోలీసులు అలర్ట్ చేశారు. స్టేషన్‌లోకి ప్లాట్ ఫాం నంబర్ 1 నుంచి కాకుండా ప్లాట్ ఫాం నంబర్ 10 నుంచి లోపలికి చేరుకోవాలని ప్రయాణికులకు సూచించారు.
ఈ రోడ్లు మూసివేత
టోబాకో బజార్ నుంచి మహంకాళి టెంపుల్‌కు వచ్చే రోడ్
బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట పీఎస్ వరకు
జనరల్ బజార్ రోడ్
ఆదయ్య ఎక్స్ రోడ్