సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం సహకరించిన జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. మేడ్చల్ కోర్టు సబ్ రిజిస్ట్రార్ జ్యోతికి 14రోజులు పాటు రిమాండ్ విధించింది.
వివరాల్లోకి వెళ్తే..సుభాష్ నగర్లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో పద్మాజా రెడ్డి అనే మహిళ కబ్జా చేసింది. కాగా, అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన జ్యోతి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం పద్మజా రెడ్డికి సహకరించింది. పోలీసులు ఇటీవల పద్మజా రెడ్డిని అరెస్ట్ చేయగా తాజాగా, ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని సైతం అరెస్ట్ చేశారు.