ఆంధ్ర్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ప్రతిపాదన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు స్థల పరిశీలన చేశారు. సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు.
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర అధికార కేంద్రమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడే తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని సీఎం స్పష్టం చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అందులో భాగంగా సచివాలయ ఆవరణలో స్ధల అన్వేషణను ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి స్వయంగా తిరిగి పరిశీలించారు.
ఆ తర్వాత విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలం, ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అనుగుణమైన డిజైన్ కూర్పుపై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.