ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, ఫలితాల ప్రకటన తదితర తేదీలను అధికారులు వెల్లడించారు. తాజాగా ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది.
- నామినేషన్ల దాఖలు: 18.12.2024 నుండి 19.12.2024 వరకు సాయంత్రం 4.00 గంటల వరకు.
- నామినేషన్ల చెల్లుబాటు జాబితా ప్రచురణ: 19.12.2024 సాయంత్రం 5.00 గంటలకు.
- నామినేషన్ల ఉపసంహరణ: 20.12.2024 నుండి 21.12.2024 మధ్యాహ్నం 3.00 గంటల వరకు.
- తుది జాబితా ప్రచురణ: 21.12.2024 సాయంత్రం 5.00 గంటలకు.
- పోలింగ్ తేదీ: 04.01.2025 (ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల) వరకు.
- ఫలితాల ప్రకటన: 04.01.2025 సాయంత్రం 5.00 గంటల నుండి.