హైదరాబాద్, ఆంధ్రప్రభ : వ్యవసాయ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 21 , 22 తేదీల్లో రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవయసాయ విశ్వ విద్యాలయం తెలిపింది. విద్యా సంవత్సరం 2023-24కుగాను రెండేళ్ల వ్యవసాయ, సేంద్రీయ డిప్లమా కోర్సుతోపాటు మూడేళ్ల డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు కౌన్సిలింగ్ జరుగుతుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం.
వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీలోని ఆడిటోరియంలో కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సీట్ల కేటాయింపును పాలిసెట్-2023 ర్యాంకులు, రిజర్వేషన్ నిబంధనల మేరకు భర్తీ చేస్తామన్నారు. కౌన్సిలింగ్ షెడ్యూల్, కౌన్సిలింగ్‌కు అభ్యర్థులు సర్టిఫికెట్లతో రావాలన్నారు., కోర్సుల ఫీజు, తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు తదితరాల వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. షెడ్యూల్‌ను చూసి విద్యార్థులు కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.