Friday, November 22, 2024

ఈ నెల 15 వ‌ర‌కు ఓన్లీ సెకండ్ డోస్…

11 లక్షల మందికి వేయాలి… ఉన్నది 3.75 లక్షలే
ఫస్ట్‌ డోస్‌ సర్టిఫికెట్‌ చూపితేనే రెండో డోస్‌
నేటి నుంచి ప్రారంభం
ఈ నెల 15 వరకూ ఇదే పరిస్థితి

హైదరాబాద్‌, : రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా ఉంది. సరిపడినన్ని టీకాలు లేని కారణంగా ఇప్పటి నుంచి కేవలం రెండో డోసు వ్యాక్సిన్‌ మాత్రమే ఇవ్వాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకు రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారని వైద్యారోగ్య వర్గాలు వెల్లడించాయి. దీంతో మొదటి డోసు వ్యాక్సినేషన్‌ను నిలిపివేసి కేవలం రెండో డోసు తీసుకునే వారికే టీకాను ఇవ్వాలని నిర్ణయిం చారు. ఇప్పటికే కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వయల్స్‌ అవసరానికి తగ్గ మోతాదులో రాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చి నట్టు తెలుస్తోంది. మే 15 వరకు మొదటి డోసు ఆపేయా లని వైద్యారోగ్య శాఖ
నిర్ణయం తీసుకుంది. 11లక్షల మంది రెండో డోసు వేయాల్సి ఉండగా, ప్రస్తుతం 3.75 లక్షల డోసులు మాత్రమే ఉన్నాయి. ఈ నెల 15 లోగా మరో 3లక్షల డోసులు వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం కలిపినా.. రెండో డోసు వారికే సరిపోవు. మరో 4లక్షల పైచిలుకు డోసులు రెండో డోసు వారికే కావాల్సి ఉంటుంది. ఇక మొదటి డోసు ప్రారంభించేందుకు వ్యాక్సిన్‌ నిల్వలు ఎక్కడివి.. ఎలా సమకూర్చుకోవాలి అన్న అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
జిల్లాల్లో నేడు, రేపు బంద్‌
వ్యాక్సిన్‌ కొరత కారణంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా ఇతర జిల్లాల్లో శని, ఆదివారాలు వ్యాక్సిన్‌ పంపిణీ నిలిపివె స్తు న్నారు. వ్యాక్సిన్‌ నిల్వలను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించడంతో డీఎం అండ్‌ హెచ్‌వోలు.. వ్యాక్సిన్‌ పంపిణీకి రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ఇదే వాతావరణం నెలకొంది. సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ఎలా వేస్తారు అన్న అంశాలపై విధివిధానాలు, మార్గదర్శకాలు ప్రత్యేకంగా విడుదల చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
45 ఏళ్ల దిగువ వారికి ఇప్పట్లో లేనట్లే
మే 1నుండి 18-44 మధ్య వయసు గల వారికి వ్యాక్సిన్‌ వేసేందుకు కేంద్రం అనుమతించినా అసలు 45 ఏళ్ల పైబడిన వారికే వ్యాక్సిన్‌ వేసే పరిస్థితి లేకపోవడంతో, ఇక 18 ప్లస్‌ ఏజ్‌ గ్రూప్‌ వారికి ఇప్పట్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యే అవకా శం కనిపించడం లేదు. ఉత్పత్తి సరిగా లేకపోవడం, ఇప్పటికే ఆయా వ్యాక్సిన్‌ కంపెనీలకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు ఉండడం తో ఇపుడు కేంద్రం పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్‌ పైనే రాష్ట్రం ఆధార పడుతోంది. ప్రైవేట్‌ లోనూ వ్యాక్సిన్‌ దొరకని పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement