హైదరాబాద్ : బోరబండలోని ఇందిరానగర్ ఫేజ్-2లో ఓ మనిషి పుర్రె, ఎముకలు లభ్యం అయ్యాయి. స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయం సెల్లార్‌లోని ఓ ఫర్నిచర్ షాపులో ఈ చెక్కపెట్టెను పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలాస పాల్ అనే వ్యక్తి 2017 నుంచి ఫర్నిచర్ షాపును నిర్వహిస్తున్నాడు. అయితే కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆ షాపును మూసేశాడు. ఆరు నెలల క్రితం పాల్ ఆ షాపును తెరిచి మళ్లీ క్లోజ్ చేశాడు. ఆ తర్వాత షాపు పరిసరాల్లో నుంచి చెడు వాసన వచ్చింది. అయితే ఆ ఏరియాలో పందులు ఎక్కువగా తిరుగుతుండటంతో అవి చనిపోయి ఉంటాయని స్థానికులు అనుకున్నారు.
అయితే పలాస పాల్ కిరాయి ఇవ్వకపోవడంతో ఆ దుకాణం యజమాని అతనిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఇటీవలే రూ. 10 వేలు ఇచ్చాడు పాల్. ఆ తర్వాత ఆ షాపును మరో వ్యక్తికి కిరాయికి ఇచ్చారు. ఈ క్రమంలో అతను వచ్చి ఇవాళ దుకాణం ఓపెన్ చేయగా భరించలేని కంపు వాసన వచ్చింది. దీంతో వారు ఎస్ ఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. షాపులోని చెక్కపెట్టెలో ఉన్న పుర్రె, ఎముకలను గుర్తించారు. ప్యాంట్, బెల్ట్ లభ్యం కావడంతో ఆ డెడ్‌బాడీ పురుషుడిదిగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బొరబొండ షాపులో మనిషి పుర్రె,ఎముకలు..
Advertisement
తాజా వార్తలు
Advertisement