తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు భయాందోళనకు గురి చేస్తున్న వేళ.. తాజాగా మరో కొత్త వ్యాధి కలవరానికి గురి చేస్తోంది. హైదరాబాద్‌లో ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి అలజడి రేపుతోంది. స్క్రబ్ టైఫస్ అనే పురుగులు ఈ వ్యాధికి కారణమవుతాయి. క్రమంగా దీని బాధితుల సంఖ్య కూడా పెరుగడం వైద్యులను కలవరపెడుతోంది. ఇటీవలి కాలంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 15 మంది స్క్రబ్ టైఫస్ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే. స్క్రబ్ టైఫస్‌తో ఈ నెలలో నలుగురు చిన్నారులు గాంధీ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు కోలుకుని డిశ్చార్జి కాగా.. మరో ఇద్దరికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
స్క్రబ్ టైఫస్ యొక్క అత్యంత సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, కొన్నిసార్లు దద్దుర్లు. స్క్రబ్ టైఫస్ సోకినవారికి యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ అందించాల్సి ఉంటుంది. వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారికి డాక్సిసైక్లిన్ ఇవ్వొచ్చు. లక్షణాలు గుర్తించిన వెంటనే యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ తీసుకోవడం ద్వారా త్వరగా వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఈ వ్యాధికి ప్రత్యేక వ్యాక్సిన్ అందుబాటులో లేదు.
ఓవైపు ఒమిక్రాన్‌తో హడలిపోతున్న నగర వాసులకు ఇప్పుడు స్క్రబ్ టైఫస్ వైరస్‌కు తోడవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భారత్‌తో పాటు ఇండోనేషియా, చైనా, జపాన్, నార్తర్న్ ఆస్ట్రేలియాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించిన కేసులు నమోదైయ్యాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital