హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో సిటీలోని వివిధ ప్రాంతాల మధ్య ఎనిమిది MMTS ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్- లింగంపల్లి (GHL-5), సికింద్రాబాద్ – హైదరాబాద్ (GSH-1) సెప్టెంబర్ 28 న నడుస్తుందన్నారు.
అదేవిధంగా.. లింగంపల్లి – ఫలక్నుమా (GLF-6), హైదరాబాద్ – లింగంపల్లి (GHL- 2), లింగంపల్లి – హైదరాబాద్ (GLH-3), ఫలక్నుమా – సికింద్రాబాద్ (GFS-7), హైదరాబాద్ – సికింద్రాబాద్ (GHS-4).. సికింద్రాబాద్ – హైదరాబాద్ (GSH-8) మధ్య స్పెషల్ ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నారు. ఇవన్నీ సెప్టెంబర్ 29వ తేదీ వరకు నడుస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు.