Tuesday, November 26, 2024

సైన్సు ప్రదర్శనలు విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందిస్తుంది – రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్

హైదరాబాద్ – పాఠశాల స్థాయిలో సైన్స్ ప్రదర్శనలు నిర్వహించడం వలన విద్యార్థులలో దాగిఉన్న నైపుణ్యాలు, సృజనాత్మకతలు పెంపొందుతాయని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్ అన్నారు. ఈరోజు జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా బాగ్ అంబర్ పేటలోని నారాయణ ఈ టెక్నో పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంబించారు. వివిధ తరగతుల విద్యార్థులు తయారుచేసిన ప్రదర్శనను తిలకించి, సైన్స్ ప్రదర్శనలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.

ఈ సందర్భంగా కిశోర్ గౌడ్ మాట్లాడుతూ భౌతిక శాస్త్రవేత్, మొదటి భాతర దేశ నోబెల్ అవార్డు గ్రహీత సార్ CV రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ పరిశోధన ఫలితాన్ని ధ్రువీకరించిన రోజు అయిన ఫిబ్రవరి 28న మనం ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలు అంటే కేవలం తరగతి గదిలో బందీలుగా ఉంటారు అనే అపోహ సమాజాలంలో ఉంది అని. కానీ నేడు నారాయణ ఈ టెక్నో పాఠశాలలో సైన్సు దినోత్సవ నిర్వహించడం చాలా మంచి పరిణామం అని అన్నారు. దీని వలన పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ మురళి కృష్ణ, డాక్టర్ వెంకట దీప్తి, ప్రిన్సిపాల్ మోని స్టాలిన్ , AO మల్లికార్జున్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement