Friday, November 22, 2024

బ‌ల‌వంతంగా త‌ల్లిదండ్రుల వ‌ద్ద అనుమ‌తి ప్ర‌తాల సేక‌ర‌ణ‌..

చల్లపల్లి : ఎయిడెడ్ పాఠశాలలో బలవంతంగా తల్లిదండ్రులు వద్ద అనుమతి పత్రాలు సేకరించారు ఉపాధ్యాయులు…. ఈ పాఠశాల మాకు అవసరం లేదు ..మా పిల్లలను వేరే పాఠశాలలో చేర్చుతామంటూ తల్లిదండ్రులు వద్దనుండి విల్లింగ్ లెటర్ లను బలవంతంగా ఉపాధ్యాయులు సేకరించడం వివాదాస్పదం అయింది. చల్లపల్లి మండలం చల్లపల్లిలో ఎస్ ఆర్ వై ఎస్ పి ఎయిడెడ్ పాఠశాలలో దాదాపు 300 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల యాజమాన్యం పాఠశాల మూసివేయడంతో 300 మంది పేద విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాల యాజమాన్యం గానీ ఉపాధ్యాయులు గాని ఇంతవరకూ తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి పాఠశాల మూసి వేస్తున్న విషయం తెలియ చేయకపోవడం గమనార్హం. అకస్మాత్తుగా తల్లిదండ్రులను సమావేశం ఉందని పాఠశాలకు పిలిపించి పాఠశాలలో ఎలాంటి సమావేశం నిర్వహించకుండా ఒక్కొక్కరిగా లోపలకి పిలిపించి వాళ్ళతో పాఠశాల మూసివేయడం మాకు అంగీకారమే అని, మా పిల్లలను వేరే పాఠశాలలో చేర్చుతామని అని రాసి ఉన్న ప్రింటెడ్ పేపర్ మీద తల్లిదండ్రులు చేత బలవంతంగా ఉపాధ్యాయులు సంతకాలు చేయించుకోవడాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ నరసింహారావు హెచ్ఎం రేణు ప్రసాద్ ఇతర ఉపాధ్యాయుల పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .ప్రభుత్వం బలవంతంగా ఎయిడెడ్ పాఠశాల స్వాధీనం చేసుకొము అని చెబుతున్నప్పటికీ ఉపాధ్యాయులు ఇలా ప్రవర్తించడం ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పిల్లల భవిష్యత్తు కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement