ఉట్నూర్ / ఇంద్రవెల్లి, జనవరి 21 (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలోని ఇంద్రవెల్లి మండలంలోని సమ్మక్క, పిప్పిరి గ్రామపంచాయతీలో మంగళవారం జరిగిన ప్రజా పాలన గ్రామసభల్లో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఆయా గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా నిరుపేదలకు లబ్ధిదారులకు మంజూరు చేయడానికి అధికారులు గత నెలకు పైగా సర్వేలు చేయడం జరిగిందన్నారు.
ఈ సర్వేలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అర్హులను గుర్తించడం జరుగుతుందని, ఎవరైనా దరఖాస్తులు చేసుకుంటే ఇప్పుడు కూడా దరఖాస్తులు గ్రామసభలో చేసుకోవాలని కలెక్టర్ కోరారు. గ్రామసభలో దరఖాస్తు కౌంటర్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, అదిలాబాద్ ఏపీడీ రవీందర్, మండల అధికారులు, గ్రామ పటేళ్లు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
విద్యార్థులతో భోజనం చేసిన కలెక్టర్.. సమస్యలపై ఆరా
ఉట్నూర్, జనవరి 21 (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ జిల్లా ఉట్కూరు మండలంలోని లాల్ టికిడిలోని తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ కళాశాల విద్యార్థులతో కలిసి ఉట్టూర్ సబ్ కలెక్టర్ యువరాజు మర్మట్ తో భోజనం చేశారు.
కలెక్టర్ విద్యార్థులతో భోజనం చేస్తూ కళాశాలలోని సమస్యలను విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య, తదితర విషయాలపై విద్యార్థులను కలెక్టర్ అడిగారు. విద్యార్థులు నీటి సమస్య లేదని కలెక్టర్ కు చెప్పారు. పలు విషయాలపై కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులతో మాట్లాడారు. కలెక్టర్ ఇంద్రవెల్లి మండలంలో జరిగిన ప్రజాపాలన గ్రామసభల్లో పాల్గొని అనంతరం ఉట్కూర్ మండల్ లాల్ టెక్ని కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి హడలెత్తించారు.