Sunday, November 24, 2024

Schedule Released – మూడు జిల్లాల్లో గవర్నర్ పర్యటన..

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్‌ వర్మ ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు వరంగల్‌, యాదాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆగస్టు 27న యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోనున్న ఆయన, అక్కడి నుంచి నేరుగా ములుగు జిల్లాకు వెళ్లి వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన అవార్జు గ్రహీతలతో సమావేశమవుతారు. యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ కళా ఖండం రామప్ప ఆలయాన్ని వీక్షించి లక్నవరంకు వెళ్లనున్నారు.

మరుసటి రోజు హనుమకొండలో పేరొందిన కళాకారులు, ప్రముఖులతో సమావేశం కానున్నారు. అనంతరం వరంగల్ ఖిల్లాను, భద్రకాళీ, వేయిస్తంభాల ఆలయాలను సందర్శిస్తారు. మూడో రోజు జనగామ జిల్లాలో కవులు, కళాకారులతో సమావేశమై అక్కడి నుంచి కొలనుపాకను సందర్శిస్తారు. గవర్నర్ పర్యటనకు నాలుగు జిల్లాల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుండగా, పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లకు సన్నద్దమయ్యారు.

ఈనెల 27న కోట గుళ్ళ ను సందర్శించనున్న గవర్నర్..
గణపురం, ఆగస్టు 23(ప్రభ న్యూస్) : ఈనెల 27న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో ఉన్న శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ ను సందర్శించనున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా మూడు రోజులపాటు చారిత్రక కట్టడాలను సందర్శించనున్నారు. 27న మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు ములుగు జిల్లా రామప్ప, జయశంకర్ జిల్లా గణపురం మండలం కోటగుళ్లలో గవర్నర్ పర్యటన కొనసాగనుంది. గవర్నర్ పర్యటనను పురస్కరించుకొని అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement