తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదల విడుదలైంది. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం ఖాళీ, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఏర్పడింది. ఈ స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23న నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ అని, నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26 ఉపసంహరణకు చివరి తేదీ అని ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న కౌంటింగ్ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల
Advertisement
తాజా వార్తలు
Advertisement