హైదరాబాద్ – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఓట్లను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం కర్ణాటక నుంచి వందల కోట్ల రూపాయలు పంపిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఓటుకు నోటు కుంభకోణంలో నాడు లంచం ఇస్తూ కెమెరాకు చిక్కిన నేటి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఇప్పుడు దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని, ఇది ఊహించిందేనని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ‘స్కామ్ గ్రెస్’కు చోటు లేదని చెబుదామంటూ ట్వీట్ లో మంత్రి పేర్కొన్నారు.
అంతకుముందు బీఆర్ఎస్ చేసిన మరో ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్ నేతలు దొరికిపోయారంటూ బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌నూ రీట్వీట్ చేశారు.