Wednesday, December 25, 2024

Scam – ఈ కార్ రేస్ కేసులో ఎసిబి జోరు – దాన కిషోర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్

ఏడు గంట‌ల పాటు ప్ర‌శ్న‌ల వ‌ర్షం
వివిధ అంశాల‌ల‌పై వివ‌రాలు సేక‌ర‌ణ‌
అనుబంధ డ్యాక్యుమెంట్ లు స్వాధీనం
ఇక కెటిఆర్, అర‌వింద‌కుమార్ ల‌కు నోటీస్ ఇచ్చే అవ‌కాశం
దాన కిషోర్ ఇచ్చిన స‌మాచారంతో వారిని ప్ర‌శ్నించ‌నున్న ఎసిబి

హైదరాబాద్‌, ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులకు హైకోర్టు ​ఉత్తర్వులు అందాయి. దీంతో ఫిర్యాదుదారుడు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ ను మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్యం నుంచి రాత్రి వ‌ర‌కు మొత్తం ఏడు గంటలపాటు ఏసీబీ ప్రశ్నించి స్టేట్‌మెంట్‌ నమోదు చేసింది. ఈ స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆధారంగా ఏసీబీ ఈ కేసులో మ‌రింత జోరుగా విచారణ మొదలుపెట్టనుంది.

ఈ నేప‌థ్యంలోనే త్వరలో కేటీఆర్ , అరవింద్‌ కుమార్‌లకు నోటీసులు జారీ చేయనుంది. దానకిషోర్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగానే ఈ ఇద్దరినీ ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ఆయన నుంచి తీసుకున్నన్న డాక్యుమెంట్లను వాళ్ల ముందు ఉంచే అవకాశం ఉంది. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే దానకిషోర్‌ తెలంగాణ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకే.. హెచ్‌ఎండీఏ నుంచి డబ్బు బదిలీ అయినట్లు ప్రభుత్వానికి తెలిపారాయన.

ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ కు ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేటీఆర్‌తోపాటు పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, అప్పటి చీఫ్‌ ఇంజినీర్‌ను బాధ్యులుగా పేర్కొన్నారు.

- Advertisement -

ప్రధాన అభియోగం ఇదే.

ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌, ఎస్‌ నెక్ట్స్‌ జెన్‌, పురపాలకశాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్‌ రేస్‌లు నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులో తొమ్మిదో సీజన్‌ రేసింగ్‌ నిర్వహించారు. అప్పటి మంత్రి కేటీఆర్‌ ఆమోదంతోనే ఒప్పందం కుదిరింది. శాఖాధిపతిగా ఎంవోయూ చేశా అని ఒప్పందంపై ఐఏఎస్‌ అర్వింద్‌ కుమార్‌ సీఎస్‌కు సమాధానమిచ్చారు. ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావించిన, అనుమానించిన వారందరికీ ఏసీబీ నోటీసులు ఇవ్వనుంది. వారిని విచారించి, వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత ఆధారాలను సేకరిస్తుంది. ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా…? అనే అంశంపై ఎక్కువ దృష్టి సారించనుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన రూ.55 కోట్లు ఎక్కడెక్కడి నుంచి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే కోణంలోనూ పరిశీలించే అవకాశముంది. అధికార దుర్వినియోగంపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే… అందుకు బాధ్యులైన వారి అరెస్టు తప్పకపోవచ్చు. ఇక ఇదే కేసులో ఈడీ కూడా ఎంట‌రైంది.. ఇప్ప‌టికే ఎసిబి నుంచి కేసు వివ‌రాలు సేక‌రించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement