Friday, November 22, 2024

SC, ST Classification – సుప్రీం తీర్పును స్వాగ‌తించిన రేవంత్..

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్వాగ‌తించారు. దీనిపై అసెంబ్లీలో నేడు కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఇదే శాసనసభలో వాయిదా తీర్మాణం ఇస్తే.. నాతో పాటు సంపత్ ను సస్పెండ్ చేసినట్టు గుర్తు చేశారు. అప్పుడు మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింద‌న్నారు. ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకుంద‌న్నారు.

2023 డిసెంబర్ 23న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించార‌న్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో బ‌ల‌మైన వాదనలు వినిపించామ‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింద‌ని పేర్కొన్నారు. ఏ,బీ,సీ,డీ వర్గీకరణ బాధ్యతను తమ ప్రభుత్వం అందరికంటే ముందు తీసుకుంటుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు..

- Advertisement -

సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ అమలుపై అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోన్న ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు చర్యలు చేపడుతామని, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకోస్తామని సీఎం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement