Saturday, September 7, 2024

Save Lives – ఎంజీబీఎస్ ప్రాంగణంలో టీఎస్ఆర్టీసీ రక్తదాన శిబిరం …

హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాతలతో ముచ్చటించారు. వారికి పండ్లు, జ్యూస్ ను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 101 ప్రాంతాల్లో సామాజిక బాధ్యతగా టీఎస్ఆర్టీసీ మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని 8 వేల మంది సిబ్బంది రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, దానం ఒక్కటే మార్గమని అన్నారు. అంతకముందు ఎంజీబీఎస్ ప్రాంగణంలో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలను నాటారు.

ఈ కార్యక్రమాల్లో టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, మునిశేఖర్, కృష్ణకాంత్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement