Friday, November 22, 2024

TS : చేనేత రంగాన్ని కాపాడండి.. మంత్రి పొన్నం

చేనేత రంగాన్ని ప్రొత్స‌హించండి
ప్ర‌జ‌ల‌కు మంత్రి పొన్నం పిలుపు
దుశ్శాలువ‌లు వ‌ద్దు.. కాట‌న్ ట‌వ‌ల్స్ ముద్దు
పుస్తకాలు, పెన్నులైనా ఇవ్వండి
బిసిగా మోడీ ఆ వ‌ర్గాల‌కు చేసింది గుండు సున్నా
ఆ వర్గాల‌కు అండ‌గా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే

హుస్సాబాద్ – చేనేత రంగాన్ని కాపాడండి – కాటన్‌ను ప్రోత్సహించండి అని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ .. అతిథులు, పెద్దలకు మర్యాద చేసేటప్పుడు కాటన్ టవల్స్‌లో సత్కరించండి అని చెప్పారు. అటు చేనేతలను ప్రోత్సహించినట్టు అవుతుంద‌న్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు. ఇటు ఉపయోకరమైన కాటన్ టవల్స్ ఇచ్చిన వారు అవుతారని అన్నారు. లేదంటే పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులైనా ఇవ్వండి అని కోరారు. మంత్రులు, అధికారులు, ప్రముఖులకు కప్పే శాలువాల వలన ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. టవల్స్ కాని, పుస్తకాలు, పెన్నులు గాని ఇస్తే ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. తన వద్దకే కాదని.. ఏ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే సహా ఇతర ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్లినా ఇవే పాటించాలని సూచించారు.

కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ఇవ్వండి..

బలహీన వర్గాలు ఆలోచించాల‌ని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి అండగా నిలబడాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ బలహీన వర్గాల వ్యతిరేకి..వారి మేనిఫెస్టోలోని 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ లో బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు చేర్చామన్నారు.

బలహీన వర్గాలకు సంబంధించి ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమం కాని ..లబ్ది కాని జరిగే నిర్ణయం తీసుకొనటువంటి ప్రధాని పట్ల దయచేసి బలహీన వర్గాలు ఆలోచన చేయాలన్నారు. కుల గణన సర్వే చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటె ..దానికి సంబంధించి పాంచ్ న్యాయ్ లోపల ఒక అంశంగా పెట్టిందన్నారు. గతంలోనే ఆ అంశాలను వ్యతిరేకించే వ్యాపార వర్గాల భారతీయ జనతా పార్టీ సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చి కుల గణన కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు.

- Advertisement -

వ్యాపార వ‌ర్గాల‌కే మోదీ అండ

పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు పొన్నం . బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో ని.. కాంగ్రెస్ మేనిఫెస్టో ని బీసీ లు చదివి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ బలహీన వర్గాల శాఖ మంత్రిగా కోరుతున్న అన్నారు. అనేక కులాలకు కార్పొరేషన్లు ఇచ్చి ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భవిష్యత్ లో బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా బలహీన వర్గాలు కాంగ్రెస్ వైపు ఉండాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement