Thursday, November 14, 2024

TG | కాలుష్యం నుండి కాపాడండి.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అనేక ఫార్మా, రసాయన పరిశ్రమల ద్వారా నిరంతర కాలుష్యం జరుగుతుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్ సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలో 15 రసాయన పరిశ్రమలు వాయువులను,రసాయనకారకలను విడుదల చేస్తున్నాయని, వాటి వలన భూగర్భ జలాలు, వాయువు భూమి కలుషితం అవుతున్నతుందన్నారు.పర్యావరణ మంత్రిత్వ శాఖ సూత్రీకరణ పరిశ్రమలను కాలుష్య రహిత వర్గంగా ఉంచిందని, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులకు కేంద్ర ప్రభుత్వం శిక్షా చర్యలను వదిలివేసిందని, కార్పొరేట్ల యాజమాన్యంలో ఉండడంతో చర్యలకు వెనుకాడుతున్నారని చెప్పారు.

బోర్డులు చర్య తీసుకోకపోతే పర్యావరణాన్ని ఎవరు కాపాడుతారని, కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం సిపిసిబి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి, హైదరాబాద్), చౌటప్పల్, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన పోచంపల్లి మండలాలలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి, హైదరాబాద్) నిపుణులతో సమగ్రమైన నిష్పాక్షిక తనిఖీ నిర్వహించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement