ప్రతి సంవత్సరం సీతాఫలం ప్రయాణికులకు, ప్రజలకు అందించేందుకు సాతాపూర్ గ్రామానికి చెందిన కొందరు శక్తివంచన లేకుండా శ్రమించి సీతాఫలాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మండల పరిధిలోని సాతాపూర్ గ్రామానికి చెందిన కొందరు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మగవారితో పాటు మహిళలు కూడా నిద్ర లేచి పొలాల వెంబడి అడవిలో తిరిగి సీతాఫల్ కాయలను సేకరించుకొని వచ్చి మరుసటి రోజు ఉదయాన్నే సాతాపూర్ గ్రామంలోని బస్టాండ్ చౌరస్తా లో వినియోగదారులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ప్రకృతి పరంగా సేకరించిన వాటికి ఎలాంటి రసాయన మందులు లేకుండా సహజంగా లభించే సీతాఫలాలను వినియోగదారులకు కొల్లాపూర్ నుండి హైదరాబాద్ వరకు అందించడం జరుగుతోంది.
మామిడి పండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్ ఎంత నో సీతాఫలం పండ్లకు సాతాపూర్ అంత ప్రఖ్యాతిగా మారుతోంది. కొల్లాపూర్ నుండి హైదరాబాద్ వెళ్లే బాటసారులు, వాహనదారులు, బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు, బస్సు డ్రైవర్లను రిక్వెస్ట్ చేసి బస్సు ఆపుకొని సీతాఫల్ కాయలను కొనుగోలు చేయడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సహజసిద్ధమైన వృక్షాల నుండి సేకరించిన సీతాఫలం కాయలను ప్రజలకు అందుబాటులో ఉంచడం సాతాపూర్ గ్రామానికి నాందిగా వస్తుంది. సాతాపూర్ లో దొరికే సీతాఫలం అనగానే నోరూరించే సీతాఫలం అని ప్రతి ఒక్కరూ బస్సుల్లో, కార్లలో చర్చించుకోవడం జరుగుతుంది. సీతాఫలం పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని డాక్టర్లు చెప్పడంతో శరీరానికి మంచి పోషకాలను అందుతుందనే నమ్మకంతో ప్రజలు రోజుకు అధిక సంఖ్యలో కొనుగోలు చేయడం జరుగుతుంది.