Thursday, November 21, 2024

సర్పంచ్, ఉప సర్పంచ్.. పారిశుద్ధ్య కార్మికులు అయిన వేళ…

అశ్వాపురం మండలం మొండికుంట… రాష్ట్రవ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యలు తీర్చాలని సమ్మెబాట పట్టారు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు… ఈ నేపథ్యంలో గ్రామ వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి పారిశుద్ధ్యం లోపిస్తుందని గ్రామ ప్రజలు ఇబ్బందులు పడవద్దని అనుకున్నదే తడవుగా మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య పనులకు ఉపయోగించే టాక్టర్ ని తీసుకుని గల్లీలలో ఉన్న తడి చెత్తని పొడి చెత్తని చెత్త చేదారాన్ని సేకరించి డంపింగ్ యార్డ్ కి తరలించారు

గ్రామ ప్రజల కోసం పారిశుద్ధ్య కార్మికులుగా గ్రామంలో పనిచేస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్ని’ శభాష్’ అంటూ ప్రశంసలు వర్షం కురిపించారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ చేనమల్ల శివారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement