Friday, November 22, 2024

Saroornagar – మినీ ట్యాంక్ బండ్ పై నిమజ్జన కోలాహలం ….ఏర్పాట్లు పరిశీలించిన ఎల్బీనగర్ ఏసీపీ

సరూర్ నగర్, సెప్టెంబర్ 23( ప్రభ న్యూస్): సరూర్ నగర్ చెరువు మినీ ట్యాంకుమండ్ పై నిమజ్జన కోలాహాలం నెలకొంది.. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి… అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన మండ‌ప నిర్వాకులు మూడు రోజులు, ఐదు రోజుల అనంతరం సరూర్ నగర్ ట్యాంకుబండ్ పై గణనాథులను నిమజ్జనం చేస్తారు..సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం వేడుకలు మొదలు కావడంతో ఎల్బీనగర్ ఏసిపి జానకి రెడ్డి,, సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

శనివారం నిమజ్జనం లో బాగంగా ఇప్పటివరకు ఐదు క్రేన్లతో కొనసాగుతున్నాయని అలాగే ముందు ముందు పెరిగే నిమజ్జనం వేడుకలను దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జానకి రెడ్డి తెలిపారు. నిమజ్జనం వేడుకల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, భద్రతలో భాగంగా సరూర్నగర్ కట్ట మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని వెల్ల‌డించారు. ఇప్పటికే వంద సీసీ కెమెరాల నిఘాతో 500 మంది పోలీస్ బృందంతో జిహెచ్ఎంసి అన్ని విభాగాల అధికారులు అందరినీ కలిసి ఎలాంటి అవాంఛనీయలు ఇక్కడ జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులకు వినాయకుడి విగ్రహాలకు రోడ్డు మీద నుండి వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏసిపి వెల్లడించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement