Friday, January 24, 2025

Saroornagar అల‌క‌నంద కిడ్నీ స్కామ్ – సిబిఐ విచార‌ణ‌కు ప్ర‌భుత్వం ఆదేశం

హైదరాబాద్‌ సరూర్ నగర్ లోని అలకనంద ఆసుపత్రిలో వెలుగు చూసిన ‘కిడ్నీ రాకెట్’ కేసును తెలంగాణ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని దామోదర రాజనర్సింహ కోరారు.

ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, ఈ రాకెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టుకోవాలన్నారు. దోషులకు చట్టప్రకారం శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరొకరు ఇలాంటి పని చేయాలంటేనే వణికిపోవాలన్నారు.

- Advertisement -

ఇప్ప‌టికే ఎనిమిది అరెస్ట్

ఈ కేసులో పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆసుపత్రి చైర్మన్ సుమంత్, మరో వ్యక్తి గోపి సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమంత్, గోపిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

సరూర్‌నగర్‌లోని అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి దందా సంచలనం సృష్టించింది. సాధార‌ణ హస్పిట‌ల్ గా అనుమ‌తులు తీసుకుని ఏకంగా కిడ్నీఆప‌రేషన్ చేస్తున్న విష‌యం ఒక పేషేంట్ ద్వారా వెలుగు చూసింది.. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇలాంటి వ్యవహారాలపై విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement