Tuesday, November 19, 2024

Sarangpur – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి బిగ్ షాక్.. ప్రభుత్వ తీరుకు నిరసిస్తూ చించోలిలో రాస్తారోకో..

సారంగాపూర్ అక్టోబర్ 8 ప్రభ న్యూస్ – నూతనంగా ఏర్పడ్డ బీరవెల్లి మండలంలో మనకు చించోలి గ్రామాన్ని కలపడం నిరసిస్తూ ఆ గ్రామ ప్రజా ప్రతినిధులు ముకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు.ఆదివారం మండల కేంద్రంలో పార్టీలకతీతంగా ఆ గ్రామ ప్రజా ప్రతినిధులు ధర్నాకు దిగారు.. మలక్ చించొలీ గ్రామాన్ని 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారంగాపూర్ మండలం నుంచి వేరుచేసి 12 కిలోమీటర్ల దూరం లో ఉన్న బీరవెల్లి నూతన మండలం కలపకూడదంటూ నినాదాలు చేస్తూ, రోడ్డుపై భైఠాయించారు. మండల మార్పు పై ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే మూకుమ్మడిగా గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు మొత్తం రాజీనామా చేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement