సంతోష్ నగర్‌లో గ్యాంగ్‌రేప్ కీలక మలుపు తిరిగింది. తనపైన ఓ ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్టుగా సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఓ యువతి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా నాటకమని పోలీసులు తేల్చేశారు. అసలు ఆమె పైన గ్యాంగ్ రేప్ జరగలేదని మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయి.
ఆటోడ్రైవర్ సహా ముగ్గురు తనను ఎత్తుకెళ్లి రేప్ చేశారని… యువతి తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్టు గుర్తించారు. యువతి ఫిర్యాదుతో సంతోష్‌నగర్ పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కిడ్నాప్, అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లూ దొరకలేదు. దీనితో పోలీసులకి అనుమానం రావడంతో యువతిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు నిజం ఒప్పుకుంది. రాత్రి పూట బయటకు వెళ్లేందుకు ఈ నాటకం ఆడినట్లుగా యువతి ఒప్పుకుంది. ప్రియుడిని కేసులో ఇరికించేందుకు యువతి డ్రామా చేసినట్టు గుర్తించారు.
యువతి చెప్పిన సమాధానం విన్న పోలీసులు షాక్ అయ్యారు. ఇంత కట్టుకథ అల్లిన యువతి పై పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతారో అన్నది చూడాలి. కాగా, గతంలో ఘాట్ కేసర్ లో ఓ యువతి కూడా తనపైన ఇలాగే గ్యాంగ్ రేప్ జరిగిందంటూ కట్టుకథ అల్లిన సంగతి తెలిసిందే.