Saturday, January 11, 2025

Sankrathi Effect – శంషాబాద్ లో ప్ర‌యాణీకుల సునామీ .. నిబంధ‌న‌ల‌లో మార్పు చేసిన అధికారులు

ఎయిర్ పోర్టుకు వేలాది మంది రాక‌
కిట‌కిట‌లాడుతున్న ప‌రిస‌రాలు
ఎయిర్ పోర్ట్ లాంజ్ లో కిక్కిరిసిన జ‌నం
ప‌ల్లె ప‌రుగు కోసం విహంగయానం
అందుబాటులో అద‌న‌పు విమానాలు
ర‌ద్దీతో నిబంధ‌న‌ల‌లో మార్పు చేసిన అధికారులు
మూడు గంట‌ల ముందే ఎయిర్ పోర్ట్ కు రావాల‌ని ఉత్త‌ర్వులు

హైద‌రాబాద్ – సంక్రాంతి పండుగ‌కు న‌గ‌ర‌వాసుల‌ను పల్లెలు పిలుస్తున్నాయి.. దీంతో బ‌స్సులు, రైళ్లు, కార్ల‌లో స్వంత ఊళ్ల‌కు ప‌య‌న‌మవుతున్నారు.. ఈ ఏడాది ఎప్పుడు లేనంత‌గా ప్ర‌యాణాలు కొన‌సాగుతుండ‌టంతో రైళ్లు, బ‌స్సులు అన్ని ఫుల్ అయిపోయాయి.. ఈ స్థితిలో విమానా ప్ర‌యాణాల‌వైపు జ‌నం చూపు ప‌డింది.. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఉరుకులు ప‌రుగులెత్తుతున్నారు. దీంతో బ‌స్టాండ్, రైల్వ్ స్టేష‌న్ ల మించి ర‌ష్ అక్క‌డ‌ కొన‌సాగుతున్న‌ది.. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

- Advertisement -

ప్ర‌యాణికులు విమానాశ్రయానికి విపరీతంగా వస్తున్న తరుణంలో . రెండు నుంచి మూడు గంటల కంటే ముందే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాలని సూచనలు చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తనిఖీలు చేయడం కాస్త ఆలస్యం అవుతుందని అందుకే ఈ రూల్స్ పాటించాలని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు సూచనలు చేశారు. ఈ రూల్స్ పాటించకపోతే ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుందని వెల్లడించారు.

శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే దేశీయ అలాగే అంతర్జాతీయ ప్రయాణికులు… ఇకపై… ప్రయాణ సమయానికి రెండు నుంచి మూడు గంటల కంటే ముందు చేరుకోవాలని , లేకుంటే బోర్డింగ్ పాస్ స‌కాలంలో పొందే అవ‌కాశం ఉండ‌ద‌ని చెప్పారు. అలాగే దేశీయ ప్రయాణీల‌కు త‌క్కువ ల‌గేజ్ మాత్ర‌మే తీసుకురావాల‌ని, త‌నిఖీల‌లో సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని సూచించారు.. ఇక ఈ నెల 18వ తేది వ‌ర‌కు ప్ర‌యాణీకుల‌కు సెండాఫ్ ఇచ్చేందుకు ఎవ్వ‌రు రావ‌ద్ద‌ని కోరారు.. ఇది ఇలా ఉంటే విశాఖ‌, విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, బెంగుళూరు, చెన్నైల‌కు వివిధ సంస్థ‌లు త‌మ స‌ర్వీస్ ల‌ను రెట్టింపు చేశాయి.. ఎయిర్ పోర్ట్ లోనే క‌రెంట బుకింగ్స్ ను కూడా తెరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement