హైదరాబాద్ – పారిశుధ్య కార్మికులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే రోజైన సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పారిశుధ్య కార్మికుల వేతనం రూ.వెయ్యి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే వేతనాల పెంపు అమలులోకి రానున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నది. జీహెచ్ఎంసీ, జలమండలి, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. ఇదిలా ఉండగా.. ఆర్టీసీ కార్మికుల వేతనాలను సైతం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖకు ఆదేశించారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement