కొత్లాపూర్‌లో సంఘటన
మృతి చెందిన స్వాతిది సదాశివుపేట
ఆస్పత్రి వద్ద మృతిరాలి బంధువుల ధర్నా
ఆంధ్రప్రభ స్మార్ట్, సంగారెడ్డి : సంగారెడ్డి మండలం కొత్లాపూర్ లోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పన్నీరు స్వాతి శనివారం ఉదయం ఆత్మ హత్య చేసుకుంది. రెండో అంతస్థు భవనంలోని రూమ్‌లో ఉంటున్న ఆమె ఉరి వేసుకుని మృతి చెందింది. బాలిక ఉరి వేసుకున్నట్లు సిబ్బందికి తెలిసినే వెంటనే సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిరార్ధరించారు. మృతి చెందిన పన్నీరు స్వాతి సదాశివపేటకు చెందిన పన్నీరు పాండు కుమార్తె. బాలిక మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే సదాశివుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె ఆత్మకు గల కారణాలు తెలియరాలేదు.
ఆస్పత్రి వద్ద ధర్నా
తొమ్మిదో తరగతి విద్యార్థిని స్వాతి మృతి చెందిన విషయాన్ని తండ్రి పాండుకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులతోపాటు, బంధువులు, గ్రామస్థులు సంగారెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియజేయాలని, విద్యార్థిని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుతూ స్వాతి బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ధర్నా చేశారు.