Tuesday, November 19, 2024

కరోనాతో ఇబ్బంది పడుతున్నవారు నా సేవలు ఉపయోగించుకోండి: జగ్గారెడ్డి

కరోనాతో పోరాడే వారికి కి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను ఎప్పుడు సాయం చేయడానికి ముందు ఉంటానని చెప్పారు. అంతే కాదు కరోనా తో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు తన సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. కరోనా సోకకుండా ఉండేందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు సూచనలు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా రెండు మాస్క్ లు ఉపయోగించాలని.. నియోజకవర్గంలోని వ్యాపారవేత్తలు బట్టల షాప్ లో, కిరాణంలో సేటు లు తప్పనిసరిగా రెండు మస్కులు ఉపయోగించాలన్నారు..ప్రజలు కూడా షాపింగ్, దుకాణాలకు వెళ్ళిన్నపుడు రెండు రెండు మస్కులు వాడాలన్నారు..వ్యాపారవేత్తలు ఉదయం 6 గంటల ను౪ మధ్యాహ్నం వరకు దుకాణాలు తెరుచుకొని ,మళ్ళీ సాయంత్రం 6 గంటలకు తెరిచి రాత్రి 8 గంటల స్వచ్చందంగా మూసివేయాలని సూచించారు…ఇక సంగారెడ్డి నియోజకర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎవరు మూడు నెలలు వరకు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని..దయచేసి ఇంటికే పరిమితం అవ్వాలని… ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం ఇదే పాటించాలని కోరారు.

యువత బయట తిరిగి వచ్చి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కారోనా అంటించే ప్రమాదం ఉందని..యువత కు సాధారణంగా ఇమ్మ్యూనిటి శక్తి ఎక్కువ ఉంటుంది..దీంతో కారోనా వచ్చిన తెలియదు..కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అది సోకుతుంది.. కాబట్టి యువత జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఇక నియోజకవర్గంలో ఎవరైనా కరోనా తో తీవ్ర ఇబ్బంది ఎదురుకుంటున్న వాళ్ళు తన ఆఫీస్ నెంబర్ 08455- 278355 కి ఫోన్ చేస్తే తగిన సహాయం చేస్తామని తెలిపారు..ఎవరైతే శ్వాస తో కానీ ఇతర లక్షణాలతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నవారు తన సేవలు ఊపయోగించుకోవాలన్నారు..నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు సీరియస్ గా ఉన్నవాళ్ళకి నేను అటాచ్ చేస్తా డబ్బులు ఉన్నవాళ్లు కట్టుకోండి, లేనివాళ్ళకు నా శక్తీ మేరకు సహాయం చేస్తానన్నారు..అలాగే సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ లో ఎవరైనా ఆక్సిజన్ లేక ఇబ్బంది పడితే తనకు తెలియజేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement