సంగారెడ్డి : సదాశివపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. ధరణి పోర్టల్ గురించి స్వయంగా రైతులను అడిగి తెలుసుకున్నారు.ధరణి పోర్టల్ రైతులకు మేలు చేసిందని మంత్రికి సమాధానం ఇచ్చారు రైతులు. ధరణి తెచ్చిన రాష్ట్ర సర్కార్ తమకు మేలు చేసిందని సంతోషం వ్యక్తం చేశారు రైతులు. గతంలో ధరణి రాకముందు భూమిని ఇంట్లో వాళ్ళ పేరు మీద మార్పించాలన్నా అధికారుల చుట్టు కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండే. ఇపుడు ధరణి ఆన్ లైన్ లో జెల్ది చేసేస్తున్నారు అన్నారు సూర అనంతమ్మ.. ఒకపుడు భూమి అమ్ముకుంటే ఆఫీసర్లకు , దళారులకు లంచాలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ , మ్యుటేషన్ పని అవుతుండేదని.. ఇపుడు ఎవరిని కలవాల్సిన అవసరం లేదన్నారు. ధరణిలో అప్లై చేసుకుంటే చెప్పిన డేట్ లో పని పూర్తి చేసి పాస్ బుక్ ఇస్తున్నారన్నారు.
Sangareddy : ధరణి పోర్టల్ గురించి రైతులను అడిగి తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు
Advertisement
తాజా వార్తలు
Advertisement