Sunday, January 19, 2025

Sangareddy l సిలిండర్ పేలి దివ్యాంగురాలు సజీవ దహనం

సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. సిలిండర్ పేలి దివ్యాంగురాలు సజీవ దహనం అయింది. ఈ సంఘటన ఇవాళ తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

సంగారెడ్డి జిల్లా నిజాంపేట (మం) నాగదర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి దివ్యాంగురాలు కంది ప్రేమల(48) సజీవ దహనం అయింది. ఈ దివ్యాంగురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది.

అయితే..గత రాత్రి వంట చేసుకునే సమయంలో మంటలు చెలరేగాయి. ఒకసారిగా మంటలు ఎగిసిపడి గ్యాస్ సిలిండర్ పేలిందని అంటున్నారు. దీంతో దివ్యాంగురాలు సజీవ దహనం అయింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement