Monday, November 18, 2024

Sangareddy Jail లగచర్ల బాధితుల‌తో బీజేపీ ఎంపీలు ములాఖత్‌

సంగారెడ్డి సెంట్రల్‌ జైలులోని రిమాండ్ ఖైదీలుగా ఉన్న 16 మంది లగచర్ల బాధితులతో బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌ ములాఖత్‌ అయ్యారు. సోమ‌వారం సంగారెడ్డి సెంట్ర‌ల్ జైల్‌కు వెళ్లి వారితో మాట్లాడారు. వారి బాధ‌ల‌ను విన్నారు.

బ‌ల‌వంతంగా లాక్కుంటామ‌న‌డం వ‌ల్లే రైతులు ఆగ్ర‌హం
ములాఖ‌త్ అనంత‌రం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ డి.కె.అరుణ మాట్లాడుతూ లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమని రైతులు ఎనిమిది నెలలుగా ఆందోళన చేస్తున్నారని, బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని పేర్కొన్నారు. రైతులు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని చెప్పారు. వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకు రాకపోతే కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.

పోలీసుల వైఫల్యంతోనే లగచర్ల ఘటన జరిగిందని డీకే అరుణ ఆరోపించారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను భయపెట్టారని తెలిపారు. భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారన్నారు. ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ వాళ్లను వ‌దిలి…
గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్లను వదిలేసి మిగతా వాళ్లను అరెస్ట్ చేశారని డికే అరుణ‌ అన్నారు.
సీఎం సోదరుడు ఆ గ్రామానికి వెళ్ల‌వ‌చ్చున‌ని, కానీ త‌న‌ను అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని డీకే అరుణ ప్రశ్నించారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారని తెలిపారు. మీరు సీఎం అయితే మా నియోజకవర్గం బాగుంటుందని అనుకుంటే మీరు జనాలపై కక్ష కట్టారన్నారు. సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకని నిలదీశారు. ఓటేసి గెలిపించిన జనాల కంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా అని ప్ర‌శ్నించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement