హైదరాబాద్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు సమాచారం పోస్టుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరించారు. ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్టు చేస్తే ఊరుకునేది లేదని చెప్పారు.
సినీనటుడు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిందని స్పష్టం చేశారు.
- Advertisement -