Thursday, December 26, 2024

Sandya Stampede Case – ముగిసిన అల్లు అర్జున్ విచార‌ణ‌….

హైద‌రాబాద్ – సంధ్య ధియేట‌ర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ తో పోలీసుల‌ విచార‌ణ పూర్తి అయింది.. ఈ కేసు విచార‌ణ‌కు నేడు చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ రావాల్సిందిగా పోలీస్ లు అంద‌జేసిన నోటిస్ తో త‌న న్యాయ‌వాదితో క‌ల‌సి అల్లు అర్జున్ హాజ‌ర‌య్యారు.. ఈ క్ర‌మంలోనే ఎసిపి,సెంట్ర‌ల్ డిసిపి లు అల్లు అర్జున్ ను విచారించారు.. ఘ‌ట‌న‌పై ఆయ‌న‌ను ప్ర‌శ్నించారు.. దాదాపు రెండు గంట‌ల పాటు అల్లుఅర్జున్ విచార‌ణ‌ను ఎదుర్కొన్నారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. అనంత‌రం ఆయన త‌న నివాసానికి బ‌య‌లుదేరి వెళ్లిపోయారు..

కాగా, పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా ఈనెల 4న సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి రేవతి మరణించగా..ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం 18 మందిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఈనెల 13వ తేదీన ఉదయం అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించగా..హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు అవ్వడంతో 14వ తేదీన జైలు నుంచి విడుదలయ్యాడు.

కేసు దర్యాప్తులో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మూడు రోజుల కింద అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు తనపై అవాస్తవాలు నమోదు చేశారంటూ అల్లు అర్జున్ ఆరోపించారు. ఈ తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేదని చెప్పే ప్రయత్నం చేశాడు. కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లు అర్జున్ కన్ ఫెషన్ స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే మంగళవారం ఉదయం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎదుట హాజరవ్వాలని సోమవారం పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు.. ఎసిపి ర‌మేష్ కుమార్ , సెంట్రల్ జోన్ డిసిపి, సిఐ రాజు లు అల్లు అర్జున్ ను న్యాయ‌వాది అశోక్ రెడ్డి స‌మ‌క్షంలో విచారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement