నాంపల్లి కోర్టులో ముగిసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు
రెగ్యులర్ బెయిల్ ను వ్యతిరేకించిన పోలీసులు
బెయిల్ మంజూరు చేయాలంటూ అల్లు లాయర్స్ అభ్యర్ధన
తీర్పును మూడో తేదికి వాయిదా వేసిన న్యాయమూర్తి
హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీనటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ నాంపల్లి కోర్టులో నేడు ముగిసింది. నిందితుడుకి బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అయితే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను ముగించిన కోర్టు.. తీర్పును జనవరి 3కి వాయిదా వేసింది.
ఇది ఇలా ఉంటే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈనెల 27న రిమాండ్ ముగియగా అదే రోజు ఆయన వర్చువల్గా కోర్టుకు హాజరయ్యారు. ఇక ఈ కేసుపై విచారణ జనవరి 10వ తేదిన జరగనుంది..