Friday, November 22, 2024

ఇసుక అక్రమ రవాణ చేస్తే కఠిన చర్యలు … ట్రాక్టర్ ఓనర్ల, డ్రైవర్లకు ఆర్ ఐ, ఎస్ ఐ వార్నింగ్

బీర్కూర్ ఆగస్టు 28ప్రభ న్యూస్: బీర్కూర్ మండల కేంద్రంలో ట్రాక్టర్ ఓనర్ల, డ్రైవర్లతో ఎస్.ఐ. నర్సింలు,ఆర్.ఐ.సురేందర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామంలో అక్రమ ఇసుక ట్రాక్టర్లు నడిపిస్తున్న నేపథ్యంలో ఎస్.ఐ.నర్సింలు మాట్లాడుతూ సరైన పత్రాలు లేనిది ట్రాక్టర్ రోడ్ మీద తిరిగితే కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరించారు.అంతే కాకుండా ట్రాక్టర్ నడిపే డ్రైవర్ కు లైసెన్స్ తప్పనిసరి అని సూచించారు.

అనంతరం ఆర్.ఐ సురేందర్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన తరంగా కేసులు నమోదు చేస్తామని ట్రాక్టర్ యజమానులకు సూచించారు.ఇసుక రవాణా చేసేవారు,ఇంటి నిర్మాణానికి ఇసుక అవసరం వున్న వారు డీడీ తీసి పర్మిషన్ తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ఎస్.ఐ. నరసింహులు తోపాటు అర్.ఐ సురేందర్,ట్రాక్టర్ యజమానులు బాబ్జీ,లింగం,మోషిన్, సాయిలు, కిషన్,ఆరిఫ్,మన్నాన్,రవి, బస్వంత్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement