గీసుగొండ (వరంగల్) (ఆంధ్రప్రభ) అర్దారాత్రి వేళల్లో అడ్డగోలు దందా చేస్తున్నారు. ప్రకృతి సిద్దమైన గుట్టలను కనుమరుగు చేస్తున్నారు.
అధికారులకు తెలిసే ఈ దందా జరుగుతుందా అనే అనుమానాలను మొగిలిచెర్ల వాసులు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలు లేకుండా గుట్టలను తొలిచి నేలమట్టం చేసే ధైర్యం ఎవరు ఇచ్చారు. .
రెవిన్యూ అధికారులు మైనింగ్ అధికారులు ఇంత దందా జరుగుతున్నా నిద్ర పోతున్నారా లేదా నిద్ర పాయినట్టు నటిస్తున్నారా గ్రామస్తులు ఇండ్ల నిర్మాణాల కోసం మట్టి తెచ్చుకునుంటే దాడులు చేసి భయ భ్రాంతులకు గురి చేసే అధికారులకు కాంట్రాక్టర్లు చేసే మట్టి దందా కనిపించడం లేదా అంటూ ప్రశినిస్తున్నారు.
ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదా రాత్రీ పగలు అనకుండా యదేచ్చగా మొరం తోలుతుంటే వచ్చే ధుమ్మూ ధూళితో చంటి పిల్లలు, వృద్దులు రోగాల భారిన పడుతున్నారు శ్వాసకోస సంబధిత వ్యాధులు ఊపిరి తిత్తుల సమస్యలతో పాటు క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు..
గ్రామస్తులు మట్టి గుట్టల నుంచి మట్టి తరలిస్తుండగా వచ్చే అనారోగ్య సమస్యల గురించి అనేక సార్లు గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అనేక మంది వ్యాధులతో మంచం పట్టారు. ప్రాణాలు పోతున్నాయని మొర పెట్టుకున్నా అధికారులు కనికరం కూడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -
ముడుపులిస్తే…
ఫిర్యాదులు ఇచ్చిన పట్టించుకోవడం లేదంటే కాంట్రాక్టర్ ఇచ్చే ముడుపులు తీసుకొని ఫిర్యాడులని బుట్ట దాకలు చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నాతాధికారులు స్పందించి మొరం దందాను నిలిపి వేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మొగిలిచెర్ల వాసులు హెచ్చరిస్తున్నారు.